News August 21, 2025

ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ

image

TG: రాజకీయ కారణాలతోనే తనను TBGKS గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగించారని MLC కవిత సింగరేణి కార్మికులకు లేఖ రాశారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేను కార్మికుల తరఫున పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు చేస్తున్నారు. గతంలోనూ నేను US పర్యటనలో ఉన్నప్పుడే KCRకు రాసిన లేఖ లీక్ చేశారు. ఇప్పుడు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కొత్త గౌరవాధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఆ కుట్రదారులు నన్ను వేధిస్తున్నారు’ అని ఆరోపించారు.

Similar News

News March 12, 2026

ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే లాభం.. కానీ: ట్రంప్

image

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే బెనిఫిట్ అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అని.. ధరలు పెరిగితే USకు భారీగా ఆదాయం వస్తుందన్నారు. కానీ అది తన ప్రాధాన్యం కాదన్నారు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా, పశ్చిమాసియాతో పాటు ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఇరాన్‌ను అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

News March 12, 2026

కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం!

image

AP: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2026-27లో 352 స్కూళ్లలో 6, 11 తరగతుల్లో అడ్మిషన్లకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో ఖాళీ సీట్ల కోసం <>ఆన్‌లైన్‌<<>>లో అప్లై చేసుకోవచ్చు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు గడువు ఉంది. ఎంపికైన బాలికల జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేస్తారు. ఏప్రిల్ 17 వరకు ధ్రువపత్రాలను పరిశీలించి సీటును కన్ఫామ్ చేస్తారు.

News March 12, 2026

దారుణం: కాలేజీ అమ్మాయిల ఫొటోలు తీసి..

image

AP: ఏఐతో అద్భుతాలు చేయాల్సిన విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ బరితెగిస్తున్నారు. శ్రీకాకుళం(D) గురజాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా తోటి విద్యార్థినుల ఫొటోలు తీసిన కొందరు ఆకతాయిలు AIతో వాటిని అశ్లీలంగా మార్చారు. విషయం తెలియడంతో అమ్మాయిలు ఆందోళనకు దిగారు. నిందితులకు యాజమాన్యం TCలు ఇచ్చి పంపినట్లు సమాచారం.