News March 19, 2025
వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా

AP: వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు(పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ) రాజీనామా చేశారు. రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్ర MLA అభ్యర్థిగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వైసీపీని స్థాపించాక ఆ పార్టీలో జాయిన్ అయ్యారు.
Similar News
News December 24, 2025
బాధితులను క్రిమినల్స్‌గా చూడటం న్యాయమా: రాహుల్ గాంధీ

రేపిస్టులకు బెయిల్ ఇవ్వడం, బాధితులను క్రిమినల్స్‌గా చూడటం ఏ విధమైన న్యాయమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్న ‘‘ఉన్నావ్’’ అత్యాచార బాధితురాలితో అధికారులు వ్యవహరించిన తీరు కరెక్టేనా? న్యాయం కోరడమే ఆమె చేసిన తప్పా? బాధితురాలిని పదేపదే వేధించారు. ఇప్పటికీ ఆమె భయపడుతూనే బతుకుతున్నారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడం సిగ్గుచేటు’ అని ఫైర్ అయ్యారు.
News December 24, 2025
20 లక్షల ఉద్యోగాల కల్పనకే ప్రాధాన్యం: CM

AP: మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రభుత్వ శాఖలు ఇండికేటర్లను సిద్ధం చేసుకోవాలని CM చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణాంధ్ర-2047, 10 సూత్రాల అమలుపై నోడల్ అధికారులతో సమీక్షించారు. ’20లక్షల ఉద్యోగాల కల్పనే మొదటి ప్రాధాన్యంగా పని చేయాలి. 10 సూత్రాల అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి. కీలక మిషన్‌గా నీటి భద్రత అంశంపై దృష్టి పెట్టాలి. కరవు అన్న మాట లేకుండా వరద నీటి నిర్వహణ జరగాలి’ అని సూచించారు.
News December 24, 2025
ఓటుకు నోటు దొంగ నువ్వు.. అదే నీ స్థాయి: KTR

TG: CM <<18660662>>రేవంత్ స్పీచ్<<>>పై KTR అంతే ఘాటుగా స్పందించారు. ‘పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నావా? రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది. నీటి హక్కులపై రాజీపడ్డ నీ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక చిల్లర డైలాగులతో చిందులు తొక్కుతున్నావు. పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నువ్వు.. అదే నీ స్థాయి’ అని ట్వీట్ చేశారు.


