News March 9, 2025
విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది. ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థికి అవకాశం కల్పించింది. నాలుగు స్థానాల్లో ఒకటి సీపీఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News March 10, 2025
PHOTOS: ట్రోఫీతో క్రికెటర్లు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గి భారత జట్టు 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ధోనీ సారథ్యంలో 2013లో గెలిచాక 2017లోనూ అవకాశం వచ్చినా ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈ సారి వచ్చిన ఛాన్స్‌ను రోహిత్ సేన ఒడిసిపట్టుకుంది. హిట్ మ్యాన్ నాయకత్వంలో సమిష్టిగా రాణిస్తూ ఒక్క ఓటమి లేకుండా కప్పును అందుకుంది. ఈ క్రమంలో కప్పుతో క్రికెటర్లు ఫొటోలకు పోజులిచ్చారు.
News March 10, 2025
అధిష్ఠానం ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తా: అద్దంకి

TG: పార్టీ తనను గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. అధిష్ఠానం ఏ బాధ్యత ఇచ్చిన సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. అందుకే తన పేరును ప్రకటించారని పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ ఎమ్మెల్యేగా పోటీ చేయని సంగతి తెలిసిందే.
News March 10, 2025
స్టార్ హీరో సినిమాలో నిధి అగర్వాల్?

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు మూవీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తమిళ హీరో సూర్య సరసన ఈ అమ్మడు నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమాలో ఆమెను తీసుకుంటారని సమాచారం. నిధితో పాటు మరో అప్‌కమింగ్ హీరోయిన్ ఈ మూవీలో నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్’ చిత్రాల్లో నిధి నటిస్తున్నారు.