News February 26, 2025
MLC ఎన్నికకు 233 మంది పోలీస్ బందోబస్త్: ఎస్పీ

జిల్లాలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం జరగనుండగా.. 233 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో బందోబస్తు నిర్వహించే సిబ్బందికి సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చారు. జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇద్దరు డిఎస్పీలు, ఆరుగురు సీఐలతో స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పర్యటిస్తారన్నారు.
Similar News
News February 26, 2025
పోసాని అరెస్ట్ దుర్మార్గం: అంబటి

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ దుర్మార్గమని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నా పోలీసులు దుందుడుకుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. ‘అసలు పోసానిని ఏ కారణంతో అరెస్ట్ చేశారు. కూటమి సర్కార్ చట్టాలను తుంగలో తొక్కుతోంది. చంద్రబాబు, లోకేశ్‌ను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? రాష్ట్రంలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News February 26, 2025
మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

#మందమర్రి:యువకుడి అనుమానాస్పద మృతి
#బూరుగుపల్లి సమీపంలో టాటా మ్యాజిక్ దగ్ధం
#చెన్నూరు:ఇరువర్గాల పూజారుల మధ్య గొడవ
#హాజీపూర్ లో బైకులు ఢీ..ఒకరి పరిస్థితి విషమం
#MNCL:పోలింగ్ కేంద్రాల వద్ద 163BNSS యాక్ట్
#జిల్లా అంతటా శివరాత్రి వేడుకలు
News February 26, 2025
నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

1)నిర్మల్ పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సామగ్రి
2)నిర్మల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు
3)నర్సాపూర్ (జి)లో 218 లీటర్ల అక్రమ మద్యం పట్టివేత
4)కుబీర్: గుండెపోటుతో లైన్ ఇన్స్పెక్టర్ మృతి
5)దస్తూరాబాద్: పురుగుమందు తాగి ఒకరి సూసైడ్
6)నిర్మల్ : జిల్లా అంతటా శివరాత్రి వేడుకలు