News February 22, 2025

MLC ఎన్నికల్లో విజయం బీజేపీదే: బండి సంజయ్

image

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శనివారం నిర్వహించారు. కమిట్‌మెంట్‌తో పని చేస్తే పార్టీ క్యాడర్ బీజేపీకే సొంతం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా 317 జీవోకు వ్యతిరేకంగా టీచర్ల సమస్యలపై మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు.

Similar News

News February 23, 2025

రేపు శ్రీశైలానికి ఏపీ గవర్నర్ రాక

image

శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం శ్రీశైలం రానున్నారు. గత నెల 17న శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గవర్నర్‌ని కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ మేరకు గవర్నర్ శ్రీశైలం పర్యటన ఖరారైంది. 24న ప్రత్యేక హెలికాప్టర్లో గవర్నర్ సుండిపెంట చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి 25న తిరిగి వెళ్తారు.

News February 23, 2025

శెట్‌పల్లిలో చెరువులో మృతదేహం లభ్యం

image

మోర్తాడ్ మండలం శెట్‌పల్లి గ్రామానికి చెందిన బండ్ల భీమన్న(55) అనే వ్యక్తి చెరువులో పడి మరణించాడు. నాలుగు రోజుల నుంచి కనిపించకపోయినా ఆయన మృతదేహం చెరువులో లభ్యమైంది. నాలుగు రోజుల కిందట లక్ష్మీ కాల వద్దకు వెళ్లి అందులో స్నానం కోసం దిగగా బయటకు రాలేదు. కాలువ ప్రవాహానికి కొట్టుకొచ్చి చెరువులో శివమై తేలాడు. తమ్ముడు రాజన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై విక్రమ్ తెలిపారు.

News February 23, 2025

వికారాబాద్: అంగన్వాడీ పోస్టుల వివరాలు

image

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పలు జిల్లాలో ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ నేతృత్వంలో నోటిఫికేషన్ జారీ చేసి రిక్రూట్మెంట్ చేయనున్నారు. జిల్లాలో 49 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 238 మంది ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎన్నికల కోడ్ ముగియగానే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.

error: Content is protected !!