News September 27, 2024
MLG: అడవి బిడ్డల అభివృద్ధికి అటవీశాఖ సహకరించాలి: మంత్రి సీతక్క

అడవి బిడ్డల అభివృద్ధికి అటవీశాఖ సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు. పెసా చట్టంపై జాతీయ సదస్సులో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్థానిక ఆదివాసీ గిరిజన ప్రజల అభివృద్ది అవసరాల కోసం గ్రామ సభలు తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేలా చూడాలని కోరారు. ఏజెన్సీ ప్రజల కనీస అవసరాలకు ఆటంకాలు కలిగించకుండా అటవీ, పర్యావరణ శాఖను సమన్వయం చేయాలని చేయాలని కేంద్రానికి సీతక్క విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 26, 2025
సోమవారం ‘ప్రజావాణి’ రద్దు: వరంగల్ కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం(అక్టోబర్ 27) నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ఆమె సూచించారు.
News October 26, 2025
భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: WGL కలెక్టర్

భూభారతికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లో వర్ధన్నపేట, దుగ్గొండి మండలాల భూభారతి, పీఓటీ రికార్డులపై ఆమె సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ను వేగవంతం చేయాలని, దరఖాస్తులను తిరస్కరించే పక్షంలో అందుకు స్పష్టమైన కారణాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
News October 25, 2025
ఎస్ఐఆర్ ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలి: సి.సుదర్శన్ రెడ్డి

ఎస్ఐఆర్ ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన 2002 ఎస్.ఐ.ఆర్. డేటాను 2025 జాబితాతో మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా స్థితిగతులను వివరించారు. బి.ఎల్.ఓ. యాప్‌పై వివరణ ఇచ్చారు.


