News January 2, 2025

MLG: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

image

<<15041941 >>ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు <<>>మిర్యాలగూడ మండలంలో గల్లంతయిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు..UPకి చెందిన కార్తీక్‌ మిశ్రా, విజయ్‌ గోస్వామి యాదాద్రి థర్మల్‌ ప్లాంట్లో బిల్డింగ్‌ ఇంజినీర్‌లుగా పనిచేస్తున్నారు. మిత్రులతో కలిసి వజీరాబాదు మేజర్‌ వద్ద సాగర్‌ ఎడమకాల్వలో నిన్న ఈతకు వెళ్లగా.. కాలు జారి కార్తీక్ నీటిలో పడిపోయాడు. కాపాడటానికి ప్రయత్నించిన విజయ్‌‌కు సైతం ఈత రాకపోవడంతో ఇద్దరు గల్లంతయ్యారు.

Similar News

News November 17, 2025

సమ్మె వద్దు.. సమస్యలు పరిష్కరిస్తాం: నల్గొండ కలెక్టర్

image

పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మె విరమించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా తాము రాష్ట్ర అసోసియేషన్‌తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జిన్నింగి మిల్లుల యజమానులు కలెక్టర్‌కు తెలిపారు.

News November 17, 2025

మునుగోడు: తెలుగు ఉపాధ్యాయుడి సస్పెన్షన్

image

మునుగోడు(M) పలివెల జడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు గేర నరసింహను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. 4 రోజుల క్రితం ఆ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థి హనుమాన్ మాల వేసుకుని పాఠశాలకు రాగా సదరు ఉపాధ్యాయుడు అసభ్యంగా మాట్లాడడంతో పాటు మాలతీసి పాఠశాలకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రాథమిక విచారణ చేసిన అనంతరం ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

News November 17, 2025

నల్గొండ: ఆరుగురు డిశ్చార్జి.. 11 మందికి చికిత్స

image

ఇంజెక్షన్ వికటించి అస్వస్థతకు గురైన 17 మంది చిన్నారులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కొంతమంది ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యులు పై అధికారులకు సమాచారం ఇచ్చి.. వారి సలహాల మేరకు వైద్యం అందించడంతో పిల్లలంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆదివారం ఆరుగురు చిన్నారులు డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ భానుప్రసాద్ తెలిపారు. 11 మంది చికిత్స పొందుతున్నారన్నారు.