News April 21, 2024
MLG: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి
మిర్యాలగూడ టీఎన్జీవోస్ (NSP) యూనిట్ ఉపాధ్యక్షులు షేక్ మౌలానా (48) శనివారం గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఆయన MLG నీటిపారుదలశాఖ డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. టీఎన్జీవోస్ ఉద్యోగుల సమస్యలపై క్రియాశీలకంగా పని చేశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Similar News
News December 25, 2024
భువనగిరి: అంగన్‌వాడీ టీచర్ల సస్పెండ్
చిన్నారులకు ఇవ్వాల్సిన బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలడంతో BNGR కలెక్టర్ హనుమంతరావు అంగన్‌వాడీ టీచర్లను సస్పెండ్ చేశారు. వారి వివరాలిలా.. భువనగిరిలో ఓ పశువుల పాకలో బాలామృతం లభ్యమవ్వగా అధికారులు విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. గుట్ట కేంద్రం 3, మంతపురి, పుట్టగూడెం, మోత్కూర్ 7వ కేంద్రం అంగన్‌వాడీ టీచర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.
News December 25, 2024
క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి
రేపు క్రిస్మస్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి ప్రేమ, సేవా, కరుణ, త్యాగం, క్షమాగుణం వంటి అద్భుతమైన జీవన మార్గాలను అందించిన జీసస్ స్పూర్తిని కొనసాగించేందుకు మనమంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకుందామని మంత్రి పిలిపునిచ్చారు. ఏసుక్రీస్తు దయతో తెలంగాణలో ప్రజలంతా పాడిపంటలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.
News December 24, 2024
NLG: గ్రామీణ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ
నల్గొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రాంనగర్ (RSETI)లో పదో తరగతి చదువుకున్న గ్రామీణ నిరుద్యోగ మహిళలకు 30 రోజుల ఉచిత కుట్టు శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందన్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. డిసెంబర్ 30 లోపు సంస్థ ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.