News January 12, 2025

MLG: ప్రణయ్ హత్య కేసులో ట్విస్ట్ 

image

MLGలో 2018లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుభాశ్ శర్మ, మరో ఇద్దరు బెయిల్ కోసం సమర్పించిన ష్యూరిటీలు నకిలీవి అని పోలీసులు గుర్తించారు. వారిని MLG పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా, ఈ కేసులో బెయిల్‌పై బయటికొచ్చిన అమృత తండ్రి మారుతిరావు సూసైడ్ చేసుకున్నారు. 

Similar News

News November 2, 2025

NLG: నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా?!

image

నల్గొండ జిల్లాలో నూతన మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి కావడంతో కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్న వారికి వ్యాపారులు బంపర్ ఆఫర్ చేస్తున్నారు. నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా.. అంటూ ప్రలోభపెడుతున్నారు. ఈసారి టెండర్లలో పాత మద్యం వ్యాపారులకు దురదృష్టం, కొత్త వారికి అదృష్టం కలిసి వచ్చింది. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు 4906 దరఖాస్తులు వచ్చిన విషయం విధితమే.

News November 2, 2025

NLG: కాగితాలపైనే అంచనా లెక్కలు… రైతులందరికీ సాయమందేనా?

image

ఆకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతున్నారు. పంటల బీమా అమలుకు నోచుకోక ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాల్సిన అధికారులు కాగితాలపై అంచనా లెక్కనే వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సాగు విస్తీర్ణం డిజిటల్ క్రాప్ సర్వే మొక్కుబడిగానే నిర్వహించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సాగు విస్తీర్ణం నష్టం నమోదులోనూ అదే తీరు కనిపిస్తుందన్నారు.

News November 2, 2025

5న భువనగిరిలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు

image

ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన భువనగిరిలో ఉమ్మడి జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ ఆర్చరీ సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఆధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, తునికి విజయ సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెలక్షన్ పోటీల్లో పాల్గొనదల్చిన క్రీడాకారులు ఆయా పాఠశాల నుంచి తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు చేరుకోవాలని కోరారు.