News November 4, 2024

MLG: మంత్రి సీతక్కకు ఆహ్వాన పత్రం అందజేత

image

PDSU 50 వసంతాల సందర్భంగా నవంబర్ 17వ తేదీన ములుగు జిల్లాలో నిర్వహించనున్న విద్యార్థి అమరవీరుల స్మరణ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రి సీతక్కకు పలువురు నేతలు అందజేశారు. అనంతరం PDSU ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, తదితర వివరాలను మంత్రి సీతక్కకు నేతలు వివరించారు. కార్యక్రమంలో నేతలు ముంజాల బిక్షపతి గౌడ్, తదితరులు ఉన్నారు.

Similar News

News December 27, 2024

ములుగు: రోడ్లు ఊడుస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు

image

ములుగు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మె 17వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా గురువారం సమగ్ర ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చే విధంగానే తమకు సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News December 26, 2024

డాక్టర్లు అందుబాటులో ఉన్నారు: DMHO

image

హనుమకొండ జిల్లా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO డాక్టర్ అప్పయ్య సందర్శించారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల కోసం నిర్వహిస్తున్న సేవలను పరిశీలించి స్వయంగా వారికి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం అందించే వైద్య సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. అక్కంపేట, పెద్దాపూర్ పల్లె దవాఖానాల్లో డాక్టర్లు అందుబాటులో ఉన్నారని.. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News December 26, 2024

HNK: సిద్దేశ్వరునికి అన్నాభిషేకం

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో మార్గశిర మాసం గురువారం ఏకాదశి సందర్భంగా సిద్దేశ్వరునికి అన్నాభిషేకం, చెరుకుతో మహనివేదన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిద్దేశ్వరుడిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.