News November 4, 2024

MLG: మంత్రి సీతక్కకు ఆహ్వాన పత్రం అందజేత

image

PDSU 50 వసంతాల సందర్భంగా నవంబర్ 17వ తేదీన ములుగు జిల్లాలో నిర్వహించనున్న విద్యార్థి అమరవీరుల స్మరణ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రి సీతక్కకు పలువురు నేతలు అందజేశారు. అనంతరం PDSU ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, తదితర వివరాలను మంత్రి సీతక్కకు నేతలు వివరించారు. కార్యక్రమంలో నేతలు ముంజాల బిక్షపతి గౌడ్, తదితరులు ఉన్నారు.

Similar News

News December 1, 2024

నెక్కొండ: విఫలమైన ఆన్‌లైన్ ప్రేమ.. యువకుడు సూసైడ్

image

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెక్కొండ మండలంలో జరిగింది. అప్పలరావుపేటకి చెందిన వినయ్ (25) HYDలో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతనికి ఆన్‌లైన్‌లో యువతి పరిచయం కాగా..అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. దీంతో యువకుడు 5రోజుల క్రితం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News December 1, 2024

ములుగు: ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ

image

ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏటూరునాగారం మండలానికి సమీప అడవుల్లోనే జరగడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులు తెలంగాణలోకి తలదాచుకునేందుకు వచ్చారా? లేక రేపటి నుంచి జరగనున్న వారోత్సవాల కోసం తమ ఉనికి చాటుకునేందుకు వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

News December 1, 2024

ప్రజాపాలన విజయోత్సవాల్లో WGL ఎమ్మెల్యే, HNK కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రారంభమైన 2k రన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు.