News March 25, 2025
MMTSలో అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని యువతి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Similar News
News December 18, 2025
బండి సక్సెస్.. BJP@104

ఉమ్మడి KNR(D)లో జరిగిన GP ఎన్నికల్లో BJP అనూహ్యంగా 104 స్థానాల్లో గెలిచింది. గత GP ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన BJP.. బండి సంజయ్ ప్రత్యేక ప్రణాళిక, వ్యూహాత్మక ఎత్తుగడలతో పటిష్ఠ స్థితికి చేరుకుంది. పట్టణాలకే పరిమితమనుకున్న BJP ఇప్పుడు పల్లెల్లో పాగా వేసింది. ఉమ్మడి KNRలో ఒక్క BJP ఎమ్మెల్యే లేకున్నా మెరుగైన ఫలితాలు సాధించింది. క్షేత్రస్థాయిలో BJP బలపడుతుందని చెప్పడానికి ఈ ఫలితాలే ఉదాహరణ.
News December 18, 2025
ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్: ASF SP

ఈ నెల 21న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా SP నితికా పంత్ తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న క్రిమినల్, సివిల్, ఎక్సెజ్, మోటారు వాహనాల కేసులను అధిక సంఖ్యలో రాజీ కుదుర్చుకొని క్లోజ్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.
News December 18, 2025
జాతర ఏర్పాట్ల ప్రతిపాదనలు సమర్పించాలి: పెద్దపల్లి కలెక్టర్

సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల ప్రతిపాదనలు డిసెంబర్ 22లోగా సమర్పించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతర నిర్వహణపై సంబంధిత అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. పంచాయతీ రోడ్ల మరమ్మతులు, క్యూలైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా తదితర అంశాలు డిసెంబరు 22లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. స్టాండ్ బై ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని సూచించారు.


