News March 25, 2025
MMTS అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్‌గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని యువతి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Similar News
News March 26, 2025
HYD: గ్రేట్.. చనిపోతూ ఏడుగురిని కాపాడాడు!

తాను చనిపోతూ ఏడుగురికి ప్రాణం పోశాడు ఓ యువకుడు. ఎల్బీనగర్‌లో నివాసం ఉండే శ్రీ అశ్లేశ్ గురునానక్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. మైగ్రేన్, ఫిట్స్‌తో మార్చి 21 అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించగా మార్చి 23న అతడి బ్రెయిన్ డెడ్ అయ్యింది. తల్లిదండ్రులు శివశంకర్, ప్రమీల రాణి కుమారుడి అవయవదానానికి ఒప్పుకున్నారు. దీంతో జీవన్‌దాన్ ద్వారా ఏడుగురి ప్రాణాలు కాపాడారు.
News March 25, 2025
మేడ్చల్: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని SUICIDE

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మండల పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 25, 2025
HYD: ఓయూలో విధించిన ఆంక్షలపై వాయిదా తీర్మానం

ఓయూలో విధించిన ఆంక్షలపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. విద్యార్థుల ర్యాలీలు, ధర్నాల నిషేధంపై చర్చ కోరుతూ పార్టీ సభ్యులు అసెంబ్లీ కార్యదర్శికి వాయిదా తీర్మానం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం అందించారు.