News January 6, 2026

MNCL:విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు అవసరం: ఎంపీ

image

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు అత్యంత అవసరమని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాలలోని ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ,జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు.

Similar News

News January 10, 2026

విశాఖలో రూ.305 కోట్ల షిప్ టెక్నాలజీ సెంటర్: సర్బానంద సోనోవాల్

image

విశాఖ నౌకల రూపకల్పన, పరిశోధనలకు జాతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో నౌకల నిర్మాణ క్లస్టర్ అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇందుకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ–ఏపీ మారిటైమ్ బోర్డు మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రూ.305 కోట్లతో ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

News January 10, 2026

తిరుపతి జిల్లాకు మరో కంపెనీ.. 2,000 ఉద్యోగాలు..!

image

వెబ్‌సోల్ రెన్యూవబుల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.3,538 కోట్ల పెట్టుబడితో 4 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ సెల్స్, మాడ్యూళ్ల తయారీకి ఇంటిగ్రేటెడ్ యూనిట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,980 ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు పరోక్షంగా వేలాది ఉపాధి అవకాశాలు కల్పించనుంది. రాష్ట్రానికి అదనపు పెట్టుబడులు ఆకర్షించడంలో ఇది కీలకంగా నిలవనుంది.

News January 10, 2026

నేటి నుంచి గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

image

ప్రధాని మోదీ నేటి నుంచి 3 రోజుల పాటు స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఇవాళ ఆయన సోమనాథ్ ఆలయానికి చేరుకొని 8pmకు ఓంకార మంత్ర పఠనం చేస్తారు. రేపు ఆలయ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ శౌర్య యాత్ర, ఆపై బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన ట్రేడ్ షో‌ను ప్రారంభిస్తారు. 12న జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.