News January 30, 2025

MNCL: అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా: GM

image

రానున్న వేసవిలో అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా నోడల్ అధికారి, సంస్థ జీఎం గౌతమ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం మంచిర్యాలలో నిర్వహించిన సమీక్ష మాట్లాడారు. జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా రెండు కొత్త 33/11 కేవీ ఉప కేంద్రాలు, 8 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 15 అదనపు బ్రేకర్లు, 145 ట్రాన్స్‌ఫార్మర్లు, 17 లైన్ కెపాసిటర్లు అమర్చినట్లు తెలిపారు.

Similar News

News November 13, 2025

ADB: స్విమ్మింగ్‌లో దూసుకుపోతున్న చరణ్ తేజ్

image

ఆదిలాబాద్‌కి చెందిన కొమ్ము చరణ్ తేజ్ స్విమ్మింగ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన అతడు తాజాగా ఎస్.జీ.ఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాడు. హైద్రాబాద్‌లోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో చరణ్ తేజ్ కాంస్య పతకం సాధించాడు. 400 మీటర్ల ఐ.ఎం విభాగంలో కాంస్యం సాధించి మరోసారి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలిపాడు.

News November 13, 2025

పాలకీడు: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

image

పాలకీడు మండల కేంద్రంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ అడ్డ రోడ్ వద్ద కంకర టిప్పర్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మహంకాళి గూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని ప్రమాద తీరును పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 13, 2025

సిరిసిల్ల: ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించాలి

image

బాలికలకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అంశంపై తప్పనిసరిగా అవగాహన కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం.చందన అన్నారు. మిషన్ వాత్సల్య కార్యక్రమంపై సిరిసిల్ల కలెక్టరేట్ సముదాయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థలను పూర్తిగా నిర్మూలించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ పాల్గొన్నారు.