News January 30, 2025
MNCL: అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా: GM

రానున్న వేసవిలో అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా నోడల్ అధికారి, సంస్థ జీఎం గౌతమ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం మంచిర్యాలలో నిర్వహించిన సమీక్ష మాట్లాడారు. జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా రెండు కొత్త 33/11 కేవీ ఉప కేంద్రాలు, 8 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 15 అదనపు బ్రేకర్లు, 145 ట్రాన్స్‌ఫార్మర్లు, 17 లైన్ కెపాసిటర్లు అమర్చినట్లు తెలిపారు.
Similar News
News February 8, 2025
తిరుపతి: రైలులో గర్భిణిపై అత్యాచారయత్నం

రైలులో గర్భిణిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన జోసెఫ్ భార్య 4నెలల గర్భిణి. ఆమె కోయంబత్తూరు- TPT ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కి పుట్టినిల్లు చిత్తూరు సమీపంలోని మంగసముద్రానికి బయలు దేరింది. వేలూరు జిల్లాకు చెందిన హేమరాజ్(28) మహిళా బోగిలో ఎక్కి ఆమె ఒంటరిగా ఉండడంతో అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి రైలు నుంచి బయటకు తోసేశాడు.
News February 8, 2025
ఉదయం టిఫిన్ మానేస్తున్నారా?

బిజీగా ఉండటం వల్లో లేక ఇతరత్రా కారణాలతోనో చాలామంది ఉదయం అల్పాహారం మానేస్తుంటారు. అలా మానడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల నీరసం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడం, రక్తంలో చక్కెర స్థాయుల పెరుగుదల, రోజంతా విపరీతమైన ఆకలి, భావోద్వేగాల ఊగిసలాట, రోగ నిరోధక శక్తి తగ్గుదల వంటి పలు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మరి మీరు తింటున్నారా? కామెంట్ చేయండి.
News February 8, 2025
జమ్మలమడుగు: ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా మైలవరం మండలం వేపరాలకు చెందిన నాగయ్య(42) తాడిపత్రి నుంచి జమ్మలమడుగు వచ్చేందుకు బస్సు ఎక్కారు. కొలిమిగుండ్ల వద్ద గుండెపోటుకు గురైన ఆయన సీట్లో నుంచి కుప్పకూలి కింద పడ్డారు. అనంతరం ప్రయాణికులు పరిశీలించగా అప్పటికే మృతిచెందారు.