News February 2, 2025

MNCL: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ ఫీజు గడువు పెంపు

image

లక్షెట్టిపేటలోని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సంతోష్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాలలోని వర్సిటీ అభ్యాసకుల సహాయ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News October 24, 2025

అక్టోబర్ 24: చరిత్రలో ఈరోజు

image

1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం

News October 24, 2025

MBNR: హంస వాహనంపై కురుమూర్తిరాయుడి విహారం

image

ఉమ్మడి MBNR జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు హంస వాహనంపై విహరించారు. భక్తులు గోవింద నామస్మరణతో స్వామివారిని దేవతాద్రి కొండలోని కాంచన గుహ నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగించారు.

News October 24, 2025

WWC 2025: సెమీస్ చేరిన జట్లివే..

image

మహిళల వన్డే వరల్డ్ కప్(WWC) 2025లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. NZతో మ్యాచులో విజయంతో టీమ్‌ఇండియా సెమీస్ చేరింది. అంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్‌కు ముందు ఈ జట్లు తలో మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నెల 26న బంగ్లాతో మ్యాచులో భారత్ గెలిచినా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోనే ఉండనుంది. అటు మిగతా 3 జట్ల ప్రదర్శన టాప్-3 స్థానాలను ఖరారు చేయనుంది.