News July 14, 2024

MNCL: అత్తను హతమార్చిన అల్లుడు

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి దారుణం జరిగింది. కుటుంబ వ్యవహారాల విషయంలో తలెత్తిన వివాదంలో అత్తను అల్లుడు హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం..స్థానిక సున్నంబట్టివాడకు చెందిన నెల్లి విజయ కూతురు మాళవికకు ఇదే ప్రాంతానికి చెందిన శాతం వెంకటేశ్‌తో వివాహమైంది. వారం రోజులుగా జరుగుతున్న గొడవల నేపథ్యంలో వెంకటేష్ తన అత్త విజయపై కత్తితో దాడి చేసి హతమార్చి తాను సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Similar News

News November 30, 2025

రెండో విడత నామినేషన్‌కు విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్

image

నేటి నుంచి రెండో విడత పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు ఫారం నంబర్ -1 నుంచి 10 వరకు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ప్రజల నుంచి ఎక్కువ నామినేషన్లు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News November 30, 2025

ఆదిలాబాద్ జిల్లాలో పంజా విసురుతున్న చలి

image

ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 24 గంటల్లో నమోదైన వివరాలను అధికారులు వెల్లడించారు. నేరడిగొండ, అర్లిలో 10.3°C, పొచ్చెరలో 10.4°C, సోనాలలో 10.9°C, సాత్నాల, తలమడుగులో 11.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాంసిలో 11.4°C, బేలలో 11.6°C, నార్నూర్‌లో 12.9°C, ఉట్నూర్లో 14.1°Cగా నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News November 30, 2025

సిరికొండ: నలుగురు మహిళా సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

సిరికొండ మండలంలో 7గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులను గ్రామ పెద్దలు ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకున్నారు. నేరడిగొండ (జి) క్లస్టర్‌లోని 4గ్రామపంచాయతీలకు నామినేషన్ నిర్వహించగా కుంటగూడ, జెండగూడ, నారాయణపూర్, నేరడిగోండ (జి)లో నలుగురు మహిళలను సర్పంచ్‌లుగా ఏకగ్రీవం చేశారు.