News April 2, 2025
MNCL: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మంచిర్యాలలోని రాళ్లపేటకు చెందిన తెలంగాణ హోటల్ యజమాని ప్రభుదాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చిన ప్రభుదాస్‌ను భార్య మందలించగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇంటికి వెళ్లని ఆయన ఇవాళ తెల్లవారుజామున హోటల్ పక్కన గల్లీలో ఒక ఇంటి ముందు సృహ కోల్పోయి ఉన్నారు. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. ఈ మేరకు ఎస్సై వినీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News July 6, 2025
జగిత్యాల :రేపటితో ముగియనున్న పీరీల పండుగ

జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో 11 రోజుల పాటు పెద్దపులి వేషధారణలతో జరుపుకున్న పీరీల పండుగ రేపటితో ముగియనుంది. నిన్న చిన్న సర్గత్తి పురస్కరించుకొని భక్తులు మట్కిలు తీసి మొక్కులు సమర్పించుకున్నారు. రేపు పెద్ద సర్గత్తి కావడంతో వేడుకలు అంబరాన్నంటనున్నాయి. రేపు తొలి ఏకాదశి కావడంతో పలు మండలాల్లో సోమవారం మొహర్రం పండుగ నిర్వహించనున్నారు.
News July 6, 2025
తెలుగు విశ్వవిద్యాలయం.. పరీక్షల తేదీలు ఖరారు

తెలుగు విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పరీక్ష షెడ్యూల్ నేడు విడుదల చేశారు. BFA, బి.డిజైన్, (సెమిస్టర్-2,4,6); PG డిప్లొమా ఇన్ యోగ, MA, MFA, MCA, MAJ &MC, ఎం.డిజైన్ (సెమిస్టర్-2) కోర్సులకు మొదటి, 2వ సెమిస్టర్ (రెగ్యులర్/ బ్యాక్ లాగ్/ఇంప్రూవ్మెంట్) పరీక్షలు జులై/ఆగస్టులో నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు ఈనెల 19న చివరి తేదీ. రూ.100 ఫైన్‌తో 23 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
News July 5, 2025
54 ఏళ్ల తర్వాత..

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగిస్తున్నారు. 54 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచారు. 1971లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా గిల్ తొమ్మిదో ప్లేయర్ కావడం గమనార్హం. అటు ఒకే టెస్టులో రెండు శతకాలు చేసిన 3వ భారత కెప్టెన్ అతడు. ఇక WTCలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్(9) తర్వాతి స్థానంలో గిల్(8) ఉన్నారు.