News February 1, 2025
MNCL: అభయారణ్యం నుంచి వెళ్లే వాహనాలకు FEES

చెన్నూరు డివిజన్ ప్రాణహిత కృష్ణ జింకల వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన ప్రాంతం గుండా వెళ్లే వాహనాలకు పర్యావరణ రుసుం వసూలుకు ప్రతిపాదించినట్లు జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. వెంచపల్లి రక్షిత అటవీ ప్రాంతంలోని కంపార్ట్మెంట్ నంబర్ 329, కోటపల్లిలోని పారుపల్లి, చెన్నూర్లోని కిష్టంపేట బీట్ వై జంక్షన్ వద్ద 2 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామన్నారు.
Similar News
News December 1, 2025
అనంతపురం: కరెంట్ సమస్యలు ఉన్నాయా?

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD నిర్వహిస్తున్నట్లు APSPDCL ఛైర్మన్&ఎండీ శివశంకర్ తెలిపారు. రాయలసీమ జిల్లాల ప్రజలకు కరెంట్ సమస్యలు ఉంటే సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 89777 16661కు కాల్ చేయాలని సూచించారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నంబర్ 91333 31912 ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
News December 1, 2025
ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చు చేస్తున్నా..: JP

మన దేశంలో డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానమని, 90% సర్టిఫికెట్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని జయప్రకాశ్ నారాయణ ఓ ప్రోగ్రాంలో అన్నారు. స్కిల్ లేకుండా పట్టాలు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్ష ఖర్చు చేస్తున్నా కనీస విద్యాప్రమాణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో పాసైన వారిలో 20% విద్యార్థులకే సబ్జెక్టుల్లో మినిమమ్ నాలెడ్జ్ ఉంటుందని తెలిపారు.
News December 1, 2025
అమరావతికి మహర్దశ..16,666 ఎకరాల్లో మెగా ప్లాన్.!

రాజధాని అమరావతి దశ తిరగనుంది. ఏకంగా 16,666 ఎకరాల్లో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. అమరావతిని నెక్ట్స్ జనరేషన్ గ్రోత్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అంతర్జాతీయ స్థాయి ‘గ్లోబల్ స్పోర్ట్స్ సిటీ’, కొత్త రైల్వే నెట్వర్క్ ఏర్పాటు, భారీ సాగునీటి ప్రాజెక్టులకు ఊతం. కనెక్టివిటీ, క్రీడలు, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేస్తూ, అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ఈ ప్లాన్ లక్ష్యం.


