News March 1, 2025

MNCL: ఇంటర్ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేయాలి: సీఎస్

image

మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లాలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఇంటర్ పరీక్షలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

Similar News

News November 13, 2025

జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. పూడూర్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10.4℃గా నమోదైంది. తిరుమలాపూర్లో 10.5, మల్లాపూర్, మన్నెగూడెం 10.6, గోవిందారం 10.8, మద్దుట్ల 10.9, రాఘవపేట, కత్లాపూర్ 11.0, గొల్లపల్లి 11.1, నేరెళ్ల 11.2, మల్యాల 11.3, పెగడపల్లి 11.4, సారంగాపూర్ 11.5, జగ్గసాగర్ 11.7, పొలాస 11.9, కోరుట్ల, ఐలాపూర్ 12, గోదూరులో 12.2℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News November 13, 2025

మామునూరు ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం చేయాలి: MP కావ్య

image

మామునూరు ఎయిర్‌పోర్టు స్థల విస్తరణ పనులను ఎంపీ కడియం కావ్య పరిశీలించారు. కలెక్టర్ సత్యశారద, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి నక్కలపల్లి, గాడిపల్లి చెరువులు, రహదారులను పరిశీలించిన ఆమె, పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు వేగంగా జరుగుతున్నాయని ఎంపీ పేర్కొన్నారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేయాలన్నారు.

News November 13, 2025

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

image

AP: అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ వన్ స్టాప్ సెంటర్‌లో 4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 25 వరకు అప్లై చేసుకోవచ్చు. సైకో-సోషల్ కౌన్సెలర్, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 25 -42ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ, డిప్లొమా (సైకాలజీ), టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.