News March 2, 2025
MNCL: ఇంటర్ పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్

జిల్లాలో ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మంచిర్యాల కలెక్టరేట్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News December 17, 2025
11AM పోలింగ్ అప్డేట్.. ఖమ్మం జిల్లాలో 60.84%

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 మండలాలు కలిపి ఉ.11 గంటల వరకు 60.84% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ☆ ఏన్కూరు-65.63%, ☆ కల్లూరు- 68.41%,☆ పెనుబల్లి-55.83%, ☆ సత్తుపల్లి- 57.73%, ☆ సింగరేణి-60.09%, ☆ తల్లాడ- 60.04%, ☆ వేంసూరు- 61.69% ◇ 7 మండలాలు కలిపి ఇప్పటి వరకు 1,48,616 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News December 17, 2025
సిద్దిపేట జిల్లాలో 11AM@60.15% పోలింగ్

సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటలకు 60.15 % నమోదైంది. అక్కన్నపేట-62.62%, చేర్యాల-57.62%, ధూల్మిట్ట-63.39%, హుస్నాబాద్-58.22%, కోహెడ-59.72%, కొమురవెల్లి-61.61%, కొండపాక-62.89%, కుకునూరుపల్లి-66.72%, మద్దూరు-49.93% పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.
News December 17, 2025
టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇతనే.!

టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంత్రి ఫరూక్ కుమారుడు ఎన్.ఎం.డీ ఫిరోజ్ నియమితులయ్యారు. ఆయన మూడో సారి ఈ పదవిని చేపట్టారని నాయకులు తెలిపారు. అధ్యక్ష స్థానం కోసం నామినేషన్ వేశారు. అయితే ఆ పదవి ధర్మవరం సుబ్బారెడ్డికి వెళ్లడంతో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.


