News February 12, 2026
MNCL: ఇష్టం లేని పెళ్లి చేయడంతో శ్రావణి సూసైడ్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శ్రావణి(28) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. మందమర్రిలోని శ్రీపతినగర్‌కు చెందిన శ్రావణి అదే కాలనీకి చెందిన రంజిత్‌తో పెళ్లి చేశారు. భర్త ఉపాధ్యాయుడిగా, ఆమె HYDలో ఉద్యోగం చేస్తున్నారు. ఫోన్ చేసిన భర్తతో జ్వరంగా ఉందని చెప్పడంతో మంగళవారం హాస్టల్ వద్దకు వెళ్లి శ్రావణిని కలిశాడు. <<19111338>>ఇష్టం లేని పెళ్లి<<>> చేయడంతో పురుగు మందు తాగినట్లు ఆమె భర్తతో తెలిపింది.
Similar News
News March 16, 2026
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: DEO

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చీఫ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ఆదేశించారు. సోమవారం డీఈవో కార్యాలయం నుంచి నిర్వహించిన కమాండ్ కంట్రోల్ సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏవైనా అసౌకర్యాలు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరీక్షల విభాగపు అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ పాల్గొన్నారు.
News March 16, 2026
వరంగల్: 104 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 104 మంది పట్టుబడ్డారు. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 56, వెస్ట్ జోన్‌లో 18, ఈస్ట్ జోన్‌లో 16, సెంట్రల్ జోన్‌లో 14 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దుతో పాటు జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.
News March 16, 2026
ADB: ఇంటర్ అమ్మాయిలకు మంచి అవకాశం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 65 కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CET పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.200గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష మే 3న నిర్వహించనున్నారు. ఇందులో ఎంపికైన వారికీ జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.


