News March 7, 2025
MNCL: ఇస్రో ఆధ్వర్యంలో యువిక కార్యక్రమం

ఇస్రో ఆధ్వర్యంలో యువిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 23 వరకు (www.isro.gov.in)(https://jigyasa.iirs.gov.in/yuvika)లో ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 7న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేసి, మే 19 నుంచి 30 వరకు అంతరిక్షంపై అవగాహన కల్పిస్తారన్నారు. వివరాలకు సైన్స్ అధికారి మధుబాబును సంప్రదించాలని తెలిపారు.
Similar News
News March 23, 2025
మెదక్: విషాదం.. అప్పుల బాధతో రైతు మృతి

అప్పుల బాధతో రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కౌడిపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. కుషన్ గడ్డ తండాకు చెందిన పాల్త్యజీవుల (50) నెల రోజుల్లోనే తనకున్న మూడు ఎకరాల పొలంలో మూడు బోర్లు వేయించిన, నీళ్లు రాలేదు. బోర్ల కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News March 23, 2025
ములుగు: డబ్బులు కాజేసిన రేంజర్.. ఎవరెవరి ఖాతాల్లో ఎంతంటే!

తునిగాకు బోనస్ డబ్బులను<<15852374>> ఏడుగురు అటవీశాఖ సిబ్బంది<<>> ఖాతాల్లో వేపించి రేంజర్ బాలరాజు కాజేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఏటూరునాగారం రేంజర్ అప్సరున్నిసా వివరాలు.. నర్సింహులు రూ.36,912, మహబూబ్ రూ.20,563, ప్రసాద్ రూ.39,631, వైకుంఠం రూ.39,309, కృష్ణ రూ.1,32,176, భిక్షపతి 5,557, మధుకర్ 4,511 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
News March 23, 2025
యశ్వంత్ వర్మపై విచారణకు కమిటీ

జస్టిస్ <<15855484>>యశ్వంత్ వర్మ<<>> నివాసంలో భారీగా నగదు దొరకడంపై CJI అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంజాబ్&హర్యానా HC CJ షీల్ నాగు, హిమాచల్‌ప్రదేశ్ HC CJ సంధవాలియా, కర్ణాటక HC CJ అను శివరామన్ ఉన్నారు. ఈ విచారణ సమయంలో వర్మకు ఎలాంటి న్యాయపరమైన పనులు అప్పగించవద్దని సీజేఐ ఆదేశించారు. పారదర్శకత కోసం ఢిల్లీ HC CJ రిపోర్ట్‌తో పాటు వర్మ స్టేట్‌మెంట్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.