News March 18, 2025
MNCL: ఈ నంబర్లకు కాల్ చేయండి..!

ఏప్రిల్ 6న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం లాజిస్టిక్ సేవ విభాగం ఆధ్వర్యంలో ఇంటి వద్దకే కళ్యాణ తలంబ్రాలు పంపిణీకి బుకింగ్ను సోమవారం మంచిర్యాల ఆర్టీసి డిపో మేనేజర్ జనార్దన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కళ్యాణం జరిగిన తర్వాత ముత్యాల తలంబ్రాలను పంపిణీ చేస్తామని తెలిపారు. అవసరమైన వారు 7382841860, 9866771482, 9154298541 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Similar News
News November 24, 2025
BELOPలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<
News November 24, 2025
భారత్కు మరో ఓటమి తప్పదా?

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఓడిన టీమ్ఇండియా రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్సులో 201 పరుగులకే ఆలౌటై సఫారీలకు 288 రన్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అటు రేపు, ఎల్లుండి ఆట మిగిలి ఉండటంతో దూకుడుగా ఆడి <<18376327>>లీడ్<<>> పెంచుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది. రెండో ఇన్నింగ్సులోనూ భారత ప్లేయర్లు ఇదే ప్రదర్శన చేస్తే 0-2తో సిరీస్ను చేజార్చుకునే ప్రమాదముంది. దీంతో WTCలో స్థానం దిగజారనుంది.
News November 24, 2025
పెద్దపల్లి కోర్టు ఏర్పాటు వివాదం.. సుల్తానాబాద్ న్యాయవాదుల ఆగ్రహం

పెద్దపల్లి జిల్లా కోర్టును పెద్దపల్లిలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే విజయరమణరావును కలిసి వినతిపత్రం ఇచ్చిన న్యాయవాదులను ఎమ్మెల్యే అవమానించారనే ఆరోపణలతో సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షులు మేకల తిరుపతిరెడ్డి, కార్యదర్శి భూమయ్యతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.


