News February 9, 2025

MNCL: ఈ నెల 13 వరకు అవగాహన సదస్సులు

image

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 13వ తేదీ వరకు స్పర్శ్ పేరిట ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్ రాజ్ తెలిపారు. జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలన లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాధి పట్ల భయాందోళన చెందకుండా నిర్భయంగా వైద్య చికిత్సలు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 17, 2025

నల్గొండ: వచ్చే నెల నుంచే సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్

image

తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుంది అన్నారు. వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఇస్తున్నామని, కాంగ్రెస్ మాటలు చెప్పేది కాదు, చేతల్లో చూపెడుతుందని అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేయబోతున్నామని అన్నారు.

News March 17, 2025

మార్చి17: చరిత్రలో ఈరోజు

image

*1892 : తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం.
*1896 : నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత మహిళ కల్పనా చావ్లా జననం
*1990: బాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం

News March 17, 2025

కాచిగూడ: ‘దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలి’

image

దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలో రోడ్డుపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో బీసీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దేశ జనాభాలో 60శాతనికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయన్నారు.

error: Content is protected !!