News April 6, 2025
MNCL: ఈ నెల 7 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం

మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఈ నెల 7 నుంచి 15 వరకు పదో తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుందని డీఈఓ యాదయ్య తెలిపారు. మూల్యాంకనం కోసం మొత్తం 770 మందిని నియమించామని, వారంతా ఈ నెల 7న రిపోర్టు చేయాలని సూచించారు. కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవని వెల్లడించారు.
Similar News
News December 1, 2025
AP NIT, YSR ఉద్యాన వర్సిటీ మధ్య MOU

తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్(AP NIT)తో వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సోమవారం అవగాహన ఒప్పందం(MOU) చేసుకుంది. డ్రోన్ టెక్నాలజీ, డ్రయ్యర్ టెక్నాలజీ, నీటి పారుదలలో ఆధునిక యాంత్రికరణ, తెగుళ్లు గుర్తించడం, నానో టెక్నాలజీ తదితర అంశాల్లో రైతులకు అవగాహన కల్పించి ఖర్చులు తగ్గించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఏపీ నిట్ డైరెక్టర్ రమణ రావు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు.
News December 1, 2025
TG ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TG: శిఖా గోయల్, CV ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర IPS ఆఫీసర్లను IAS క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు CSకు నోటీసులిచ్చింది. GO 1342 ద్వారా ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సూరేపల్లి నంద DEC10 లోపు సమాధానం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.
News December 1, 2025
అమరావతిలో సచివాలయ టవర్లకు అరుదైన రికార్డ్లు

అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నిర్మాణ దశలోనే ఇవి పలు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద ‘డయాగ్రిడ్’ నిర్మాణం. దీనివల్ల పిల్లర్ల సంఖ్య తగ్గి, భవనం అద్భుతంగా కనిపిస్తుంది. జపాన్ తర్వాత ప్రపంచంలోనే రెండవ ఎత్తైన సచివాలయ టవర్గా (212 మీటర్లు) ఇది రికార్డు సృష్టించనుంది. ఇది 200 మీటర్ల ఎత్తు దాటిన ఏపీలోని మొదటి స్కైస్క్రాపర్.


