News March 13, 2025
MNCL: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ పాసైన BC అభ్యర్థులకు బ్యాంకింగ్&ఫైనాన్స్‌లో ఫ్రీ ట్రైనింగ్,ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్మెంట్ కల్పిస్తారన్నారు. అర్హులు ఈనెల 15 నుంచి www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏజ్ లిమిట్-26లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్-ఏప్రిల్ 8గా పేర్కొన్నారు. SHARE IT
Similar News
News September 17, 2025
త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం: మంత్రులు

TG: త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తామని మంత్రులు సురేఖ, సీతక్క వెల్లడించారు. ‘కుటుంబ బాధ్యతలు, వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడులకు గురవుతున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కూడా చూసుకోవాలి. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈనెల 22న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. మహిళల సూచనలతో కొత్త మహిళా పాలసీని తీసుకొస్తాం’ అని సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.
News September 17, 2025
హైదరాబాద్‌లో 50 మంది CIల బదిలీ

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ల బదిలీలు, పదోన్నతులు జరిగాయి. తాజాగా కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 50 మంది ఇన్స్పెక్టర్లకు బదిలీ, పదోన్నతి ఇచ్చినట్లు వెల్లడించారు. చాలా రోజుల నుంచి ఒకే పోస్టింగ్‌లో ఉన్న వారిని సైతం ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేశారు.
News September 17, 2025
ఇకపై లక్కీ డిప్లో అంగప్రదక్షిణ టోకెన్లు

శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లకు FIFO (First In First Out) స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని TTD ప్రవేశపెట్టింది. టోకెన్లు 3 నెలల ముందుగానే ఆన్లైన్లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల అవుతాయి. DEC టోకెన్ల కోసం SEP 18-20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజూ (శుక్రవారం) 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గడువు 180 రోజులుగా నిర్ణయించింది.