News October 16, 2024

MNCL: ‘ఉత్పత్తి, ఉత్పాదకత పెంపులో ప్రతి ఉద్యోగి కీలకమే’

image

ఇకపై రోజుకు 2.4లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్క ఉద్యోగి, అధికారి పాత్ర చాలా కీలకమని సింగరేణి C&MDబలరాం అన్నారు. అన్ని ఏరియాల GMలతో C&MDవీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. CMD మాట్లాడుతూ..కంపెనీ నిర్దేశించుకున్న ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

Similar News

News November 10, 2024

తలమడుగు: మద్యం మత్తులో వాగులో దూకి ఆత్మహత్య

image

మద్యం మత్తులో వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన ఆర్.నాగన్న (40) మద్యానికి బానిస అయ్యాడు. కాగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మద్యం మత్తులో స్థానిక సుంకిడి బ్రిడ్జి పై నుంచి నీటిలో దూకడంతో మునిగి చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 10, 2024

ఆదిలాబాద్: జాతీయ స్థాయి పోటీల్లో హర్షవర్ధన్ సత్తా

image

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాడు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 68వజాతీయ స్థాయి SGF జూడో పోటీల్లో కాంస్య పతకంతో మెరిశాడని జూడో కోచ్ రాజు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలవడం పట్ల పలువురు క్రీడా సంఘాల బాధ్యులు అభినందనలు తెలిపారు.

News November 10, 2024

నిర్మల్: భార్యాభర్తల మధ్య గొడవ ఆ తర్వాత.. సూసైడ్

image

ఒంటరితనంతో మద్యానికి బానిసై మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం బన్సపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జయరాజ్ తన భార్య స్వప్న మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో స్వప్న పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపం చెంది ఒంటరితనం భరించలేక జయరాజ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.