News March 25, 2024

MNCL: ఎల్లంపల్లి ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీకి చేరువలో నీటి నిల్వలు

image

ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 20. 175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8. 80 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నీటిమట్టం 148 మీటర్లకు గాను 142. 90 మీటర్లుగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే యాసంగి సాగుతో పాటు తాగునీటికి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి.

Similar News

News September 18, 2025

పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాటశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో మండలాల వారిగా, పాఠశాల సముదాయాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా ఆగస్టు నెల సగటు విద్యార్థుల హాజరు నివేదికలు, టాప్ 5 పాఠశాలలు, అట్టడుగు 5 పాఠశాలలు, పాఠశాల కాంప్లెక్స్ వారీగా సమస్యలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.

News September 18, 2025

ADB: క్రైస్తవ సంఘాలతో ఛైర్మన్ సమావేశం

image

రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ ఆదిలాబాద్‌లో బుధవారం పర్యటించారు. కలెక్టర్ రాజర్షిషాతో కలిసి క్రైస్తవ సంఘాలు, పాస్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్రైస్తవ శ్మశానవాటికకు భూమి, బీసీ-సీ కుల ధ్రువీకరణ పత్రం, క్రైస్తవ కమ్యూనిటీ హాల్ వంటి వారి సమస్యలను ఆయనకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చారు.

News September 18, 2025

ఆరోగ్యమే మహాభాగ్యం: ఆదిలాబాద్ ఎంపీ

image

ఆదిలాబాద్‌లో నిర్వహించిన స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరంలో ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. బుధవారం హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్‌లో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాతో కలిసి పేదలకు పథకం ద్వారా అందించే ఫుడ్ కిట్స్‌ను ఎంపీ పంపిణీ చేశారు. శిక్షణ కలెక్టర్ సలోని, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.