News August 3, 2024

MNCL: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో తగ్గిన నీటిమట్టం

image

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో గడిచిన నాలుగు రోజుల్లో మూడు టీఎంసీల నీటి మట్టం తగ్గింది. వర్షాలు లేక ఎగువ ప్రాంతాల నుంచి వరద నిలిచిపోగా ప్రాజెక్ట్ నీటిని నంది పంప్ హౌస్‌కు తరలిస్తుండటంతో నీటి మట్టం తగ్గింది. ప్రాజెక్ట్ నీటిమట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 146.40 మీటర్లకు చేరింది. 20.175 టీఎంసీలకు గాను 15.900 టీఎంసీలుగా ఉంది. 3,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.

Similar News

News December 15, 2025

102 మంది సర్పంచ్‌లు కాంగ్రెస్ బలపర్చిన వారే: నరేష్ జాదవ్

image

జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘన విజయం అందించారని, రెండో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నదని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. మొత్తం 156 గ్రామ పంచాయతీ స్థానాల్లో 102 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారని, దీంతో ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News December 15, 2025

వందశాతం పోలింగ్ లక్ష్యం: ADB కలెక్టర్

image

మూడవ విడత గ్రామపంచాయితీ ఎన్నికల్లో 100శాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా పనిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం గూగుల్ మీట్ ద్వారా ఎన్నికల పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని గ్రామాల్లో వందశాతం పోలింగ్ సాధించేందుకు కృషి చేయాలన్నారు.

News December 15, 2025

జైనథ్: ముచ్చటకు మూడోసారి సర్పంచ్‌గా గెలుపు

image

జైనథ్ మండలం కౌట గ్రామ సర్పంచ్‌గా బోయర్ శాలునా విజయ్ ఘన విజయం సాధించారు. గతంలో సైతం ఆమె సర్పంచ్‌గా పని చేశారు. ఇదిలా ఉంటే ఆమె భర్త బోయర్ విజయ్ సైతం సర్పంచ్ సేవలందించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఈమారు సైతం విజయం సాధించడం విశేషం. ముచ్చటగా మూడోసారి వారు సర్పంచ్‌గా గెలపొందారు. గ్రామాభివృద్ధికి తాము చేస్తున్న కృషిని గుర్తించే ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారని వారు హర్షం వ్యక్తం చేశారు.