News February 6, 2025
MNCL: ఏఐటీయూసీ కృషితోనే వయోపరిమితి పెంపు

సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కృషితోనే కారుణ్య నియామకాల ఉద్యోగ వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. కార్మికుడు మరణించిన లేదా మెడికల్ ఇన్వాల్యుడేషన్ అయిన వారసుడికి 40 సంవత్సరాల వయసు ఉన్న ఉద్యోగం ఇస్తారని పేర్కొన్నారు.
Similar News
News January 22, 2026
మేడారం: 76589 12300 నంబర్‌తో వివరాలు పొందండి!

మేడారం జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 76589 12300 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపడం ద్వారా జాతర వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రకాల సేవలను పొందవచ్చని తెలిపింది. అంటే జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నాన ఘట్టాలు సహా ఇతర వివరాలు నేరుగా వాట్సాప్‌లోనే లభిస్తాయి.
News January 22, 2026
GNT: మూడేళ్ల పరారీకి చెక్.. అత్యాచార నిందితుడు అరెస్ట్

అత్యాచార కేసులో నిందితుడిగా ఉండి 3 సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని గుంటూరు నగరంపాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఏటీ అగ్రహారం 2వ లైనుకు చెందిన ఊదర నరసింహారావు అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నాడని సీఐ సత్యనారాయణ చెప్పారు. తప్పించుకొని తిరుగుతున్న నిందితుణ్ణి పట్టుకున్నామని అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు సహించేది లేదని హెచ్చరించారు.
News January 22, 2026
జనవరి 22: చరిత్రలో ఈ రోజు

1882: స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం
1885: ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు జననం
1918: కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటు
1940: తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి మరణం
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
2014: సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం (ఫొటోలో)


