News February 13, 2025
MNCL: ‘ఒక్కో పదవికి ఒక్కో రంగు బ్యాలెట్ పేపర్’

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, విధుల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ఆచరించాలని సూచించారు. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు గులాబి రంగు, జడ్పీటీసీ, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ వినియోగించనున్నట్లు తెలిపారు.
Similar News
News November 23, 2025
సిరిసిల్ల కలెక్టరేట్లో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో (కలెక్టరేట్) ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు ఘనంగా నివాళులర్పించారు.
News November 23, 2025
జగిత్యాల: NMMS పరీక్ష నిర్వహణపై అధికారుల సమీక్ష

జాతీయ స్థాయి ప్రతిభ ఉపకార వేతనాల ఎంపిక కోసం ఆదివారం NMMS పరీక్ష జరిగింది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి కేంద్రాలు ఏర్పాటు చేశారు. జగిత్యాల ఉన్నత పాఠశాల కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాజ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాము పరిశీలించారు. విద్యార్థుల హాజరు, పరీక్షా కేంద్ర సౌకర్యాలను తనిఖీ చేసి పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని సూచించారు.
News November 23, 2025
JGTL: TRTF జిల్లా అధ్యక్షుడిగా సురేష్

TRTF జిల్లా అధ్యక్షుడిగా తుంగూరు సురేష్, ప్రధాన కార్యదర్శిగా గుర్రం శ్రీనివాస్గౌడ్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ ప్రకటించారు. జగిత్యాలలో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వీరితో పాటు 10 మంది రాష్ట్ర కౌన్సిలర్లు, 6 గురు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు,10మంది ఉపాధ్యకులు, 6గురు అదనపు ప్రధాన కార్యదర్శులు, 10మంది కార్యదర్శులను ఎన్నుకున్నారు.


