News June 16, 2024
MNCL: కవ్వాల్ టైగర్ జోన్‌కు పర్యాటకుల తాకిడి

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ కు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం ఉదయం ఐపీఎస్ అధికారి సుధీర్వెజి తన కుటుంబ సభ్యులతో కలిసి సఫారీలో అడవి ప్రాంతంలో పర్యటించారు. అడవిలో జంతువులు పక్షులను చూసి ఆయన సంబరపడ్డారు. టైగర్ జోన్ ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శని, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్నందున పర్యాటకులకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Similar News
News January 17, 2026
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ బదిలీ

ఉట్నూర్ అదనపు ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కాజల్ సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీలు చేపడుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ కాజల్ సింగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ 2 డీసీపీగా బదిలీ చేశారు. కొంత కాలంగా ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న ఆమె పలు కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారు.
News January 17, 2026
ఆదిలాబాద్: భక్తుల ఇంటికే మేడారం ప్రసాదం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని భక్తుల ఇంటికే ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఉమ్మడి ADB ఆర్టీసీ ఆర్ఎం భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు tgsrtcologistics.co.in వెబ్ సైట్, ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు.
News January 16, 2026
ADB రిమ్స్‌లో పోస్టులకు దరఖాస్తులు

ADB రిమ్స్ వైద్య కళాశాలలో వివిధ విభాగంలో డాక్టర్ పోస్టులను గౌరవ వేతనంతో పాటు కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. అర్హులైన ట్యూటర్స్, సీఎంఓ, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సీనియర్ రెసిడెంట్స్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వివరాలకు rimsadilabad.org, adilabad.telangana.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలన్నారు. ఈ నెల 23న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.


