News January 30, 2025
MNCL: కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.
Similar News
News November 28, 2025
నాన్-ఏసీ కోచ్ల్లోనూ దుప్పటి, దిండు

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.
News November 28, 2025
సిద్దిపేట: గంగాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 28, 2025
విజయవాడలో డయేరియా కేసులు.. వాస్తవమెంత.?

న్యూ RRపేటలో మరోసారి డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. వైద్యులు మాత్రం ఇప్పటివరకు ఒక్క కేసు మాత్రమే నమోదైందని, ఇది సాధారణమేనని అంటున్నారు. ఏళ్లనాటి పైపులైన్ల లీకుల కారణంగా కలుషిత నీరు వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి కాలుష్యం జరిగి డయేరియా కేసులు నమోదవుతున్న క్రమంలో అధికారులు వాటర్ బబుల్స్, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు తప్ప, సమస్యకు పరిష్కారం చూపడం లేదు.


