News March 16, 2025

MNCL: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు

image

2025-26 విద్యాసంవత్సరానికి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి 31 ఆగస్టు 2025 నాటికి విద్యార్థులకు 12 ఏళ్లకు మించకూడదన్నారు. SC, ST విద్యార్థులకు రెండేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 14, 2026

శివరాత్రికి రాత్రిపూట పూజ ఎందుకు?

image

పగలు లౌకిక పనులకు, రాత్రి ఆధ్యాత్మిక సాధనకు సంకేతం. శివరాత్రి నాటి లింగోద్భవ కాలం శక్తిమంతమైనది. చీకటి అజ్ఞానానికి ప్రతీక. అయితే శివుడు జ్ఞాన జ్యోతి. రాత్రంతా మేల్కొని చేసే జాగరణ మనలోని తమస్సును తొలగించి పరమాత్మ వైపు నడిపిస్తుంది. మనసు చంద్రునిపై ఆధారపడి ఉంటుంది. నేడు చంద్రుడు క్షీణించి ఉంటాడు. అంటే మనసు అదుపులో ఉంటుంది. ఆ సమయంలో చేసే శివారాధన ఇంద్రియాలను జయించి, శివత్వాన్ని పొందేలా చేస్తుంది.

News February 14, 2026

అధిక తేమ ముప్పు పంటలకు తప్పాలంటే?

image

నీరు నిల్వ ఉండే భూమి కాకుండా ఇసుక మిశ్రమంగల భూములను ఎంచుకోవాలి. పంట మొక్కల మధ్య తగిన దూరం ఉండాలి. దీని వల్ల గాలి, వెలుతురు ప్రసరించి తేమ సమస్య తగ్గుతుంది. పొలాలకు తప్పనిసరిగా మురుగునీరు బయటకు పోయే కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. భారీ వర్షాల సమయంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. సేంద్రియ ఎరువుల వాడకంతో నేల నిర్మాణం మారుతుంది. ప్లాస్టిక్ లేదా సేంద్రియ మల్చింగ్ ద్వారా తేమను నియంత్రించవచ్చు.

News February 14, 2026

సిక్సర్లే కాదు ఒక మార్కు ప్రశ్నా ముఖ్యమే.. ట్వీట్ వైరల్

image

అండర్-19 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ CBSE టెన్త్ పరీక్షలు రాయనున్న విషయం తెలిసిందే. దీనిపై ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘మైదానంలో లాగే కంగారు పడకుండా 100 మార్కుల కోసం పూర్తి 180 నిమిషాలు వాడుకోవాలి. ఫోర్లు, సిక్సర్లలాగే (4, 6 మార్కులు) ఒక మార్కు ప్రశ్నలను కూడా వదలకూడదు’ అని సరదాగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.