News April 11, 2025
MNCL: గ్రూప్ 1 కొలువు సాధించిన సింగరేణి ఉద్యోగి

మందమర్రి పట్టణానికి చెందిన సుజాత – రమేశ్ దంపతుల కుమారుడు దుర్గం క్రాంతి గ్రూప్1 లో 552.5 ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించారు. గురువారం క్రాంతిని ఘనంగా పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణిలో ఓవర్ మెన్గా పని చేస్తూనే గ్రూప్1 ఉద్యోగం సాధించడం అభినందనీయం అన్నారు.
Similar News
News September 15, 2025
విశాఖ: ‘వీకెండ్లో స్విగ్గీ, జోమోటో రైడర్ల సమ్మె’

విశాఖలో స్విగ్గీ, జోమోటో రైడర్లు ప్రతి శని, ఆదివారాల్లో సమ్మె చేయాలని తీర్మానించారు. జగదాంబలో సీఐటీయూ కార్యాలయంలో రైడర్ల సమావేశం జరిగింది. జోమాటో యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందో? లేదో? చూస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కుమార్ అన్నారు. స్విగ్గీ యాజమాన్యం చర్చలకు రాలేదని తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.
News September 15, 2025
పూర్వ విద్యార్థుల సాయం హర్షణీయం: MP

KNL: పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని కర్నూలు ఎంపీ నాగరాజు తెలిపారు. నగరంలోని రాక్ వుడ్ మెమోరియల్ పాఠశాలలో 1976-1986 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం జరిగింది. ఎంపీ పాల్గొని ఆరోజులను గుర్తు చేసుకున్నారు. రాక్ వుడ్ పాఠశాలను తిరిగి స్కూల్, లేదా స్టడీ సర్కిల్గా ఏర్పాటు చేసేందుకు విద్యార్థులు ముందుకు వచ్చారని, తన వంతు సాయం చేస్తానని చెప్పారు.
News September 15, 2025
మెదక్: ప్రజా పాలన ఉత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి వివేక్

ఈనెల 17న నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఉత్సవంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నారు. మెదక్లో జరిగే కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.