News April 11, 2025

MNCL: గ్రూప్ 1 కొలువు సాధించిన సింగరేణి ఉద్యోగి

image

మందమర్రి పట్టణానికి చెందిన సుజాత – రమేశ్ దంపతుల కుమారుడు దుర్గం క్రాంతి గ్రూప్‌1 లో 552.5 ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించారు. గురువారం క్రాంతిని ఘనంగా పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణిలో ఓవర్ మెన్‌గా పని చేస్తూనే గ్రూప్‌1 ఉద్యోగం సాధించడం అభినందనీయం అన్నారు.

Similar News

News April 24, 2025

వరంగల్‌లో గురువారం మెగా జాబ్ మేళా

image

వరంగల్ జిల్లాలో గురువారం మెగా జాబ్ మెళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని రజిత తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ కళాశాలలో గల ఎంప్లాయిమెంట్ ఆఫీసుకు రావాలన్నారు. పూర్తి వివరాలకు 7093168464 సంప్రదించాలని కోరారు.

News April 24, 2025

చేగుంట: రోడ్డు ప్రమాదంలో RMP వైద్యురాలి మృతి

image

చేగుంట శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ వైద్యురాలు మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా గాజులరామారం వాసి కమ్మరి మంజుల(45) బుధవారం కూతురు గ్రామమైన కామారెడ్డి జిల్లా రామారెడ్డి నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తుంది. చేగుంట వద్ద లారీ రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలవడంతో బైక్ ఢీకొని మంజుల అక్కడికక్కడే మృతి చెందింది.

News April 24, 2025

వెంకటేశ్‌తో కలిసి సినిమా.. నాని ఏమన్నారంటే?

image

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ప్యారడైజ్’ మూవీ షూటింగ్ మే 2న ప్రారంభమవుతుందని హీరో నాని తెలిపారు. ఆ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదలవుతుందని చెప్పారు. ఆ తర్వాత సుజీత్‌తో చిత్రం ఉంటుందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘వెంకటేశ్, నేను హీరోలుగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలనుకున్నారు. అలాగే శేఖర్ కమ్ములతోనూ చర్చలు జరిగాయి. అయితే ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!