News March 20, 2025
MNCL: చనిపోయినోళ్ల పేరు మీద లోన్లు.. రూ.కోటి ఘరానా మోసం

చోళ మండలం ఇన్వెస్ట్మెంట్&ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ హౌసింగ్ ఫైనాన్స్ మంచిర్యాల బ్రాంచ్లో ఘరానా మోసం జరిగినట్లు CI ప్రమోద్రావు తెలిపారు. చనిపోయిన ఆరుగురి పేర్ల మీద ఇద్దరు బ్యాంక్ అధికారులు లోన్స్ పంపిణీ చేశారు. రూ.1,39,90,000ల మోసానికి బ్రాంచ్ మేనేజర్ చల్ల ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్లో పనిచేస్తున్న చిట్టేటి అశోక్ రెడ్డి పాల్పడ్డట్లు తేలింది. కేసులో భాగంగా ప్రవీణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News December 9, 2025
ప్రకాశం: లంచం అడిగితే.. ఈ నంబర్లకు కాల్ చేయండి.!

ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ACB అధికారులు కోరుతున్నారు. ACB DSP 9440446189, సీఐలు 9440446187, 8333925624, టోల్ ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. కాగా నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం.
News December 9, 2025
ఎచ్చెర్ల: ప్రారంభమైన మూడో సెమిస్టర్ పరీక్షలు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 10 కోర్సులకు సంబంధించి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ ఎన్.లోకేశ్వరితో కూడిన అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
News December 9, 2025
విడిపోతున్న జంటలు.. పూజారులు ఏం చేశారంటే?

హలసూరు(KA) సోమేశ్వరాలయంలో ప్రేమ, పెద్దల అంగీకారం లేని జంటల పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ పెళ్లి చేసుకున్న జంటల్లో విడాకుల కేసులు విపరీతంగా పెరగడంతో పూజారులు కలత చెందారు. ఈ పవిత్ర స్థలానికి చెడ్డపేరు రావొద్దని పెళ్లిళ్లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని విడాకుల కేసుల విచారణ సమయంలోనూ పూజారులను కోర్టుకు పిలుస్తున్నారని, అది కూడా ఓ కారణం అని అధికారులు చెబుతున్నారు.


