News March 20, 2025

MNCL: చనిపోయినోళ్ల పేరు మీద లోన్లు.. రూ.కోటి ఘరానా మోసం

image

చోళ మండలం ఇన్వె‌స్ట్‌మెంట్&ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ హౌసింగ్ ఫైనాన్స్ మంచిర్యాల బ్రాంచ్‌లో ఘరానా మోసం జరిగినట్లు CI ప్రమోద్‌రావు తెలిపారు. చనిపోయిన ఆరుగురి పేర్ల మీద ఇద్దరు బ్యాంక్ అధికారులు లోన్స్ పంపిణీ చేశారు. రూ.1,39,90,000ల మోసానికి బ్రాంచ్ మేనేజర్ చల్ల ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్‌లో పనిచేస్తున్న చిట్టేటి అశోక్ రెడ్డి పాల్పడ్డట్లు తేలింది. కేసులో భాగంగా ప్రవీణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News April 18, 2025

ఘంటసాల: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..!

image

 ఘంటసాల పరిధిలోని పాప వినాశనం వద్ద విషాదం చోటుచేసుకుంది. గురువారం KEB కాలువలో పదో తరగతి విద్యార్థి పవన్ గల్లంతయ్యాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్థలంలో 11 ఏళ్ల క్రితం పవన్ తండ్రి కూడా మృతి చెందారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కుమారుడు కాలువలో కొట్టుకుపోవడంతో తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. గ్రామస్థులు పవన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

News April 18, 2025

పెద్దపల్లి: ఎల్ఆర్ఎస్ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్

image

రాష్ట్ర పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గురువారం రాత్రి LRS అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపెల్లి కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ పాల్గొన్నారు. LRSను పకడ్బందీగా అమలు చేసి, జిల్లాలో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఫీజు చెల్లించిన దరఖాస్తులకు తక్షణమే క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ఆదేశించగా, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.

News April 18, 2025

బారువా: ముస్తాబు అవుతున్న బీచ్ ఫెస్టివల్

image

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో బారువా బీచ్‌లో ఏప్రిల్ 19, 20వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా బీచ్‌లో ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లల్ని సముద్రంలోకి విడిచిపెడతారు. ఈ ఫెస్టివల్‌లో బీచ్ వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, బోట్ రైడింగ్ మొదలైన క్రీడల పోటీలు నిర్వహిస్తారు.

error: Content is protected !!