News April 4, 2025

MNCL: జాతీయస్థాయి పోటీలకు హాసిని ఎంపిక

image

గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి ఖేలో ఇండియా ఉషూ లీగ్ పోటీలకు మంచిర్యాల జిల్లాకు చెందిన అటుకపుర హాసిని ఎంపికైంది. అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వేముల సతీష్, ఆవుల రాజనర్సు వివరాలు వెల్లడించారు. సౌత్ జోన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. హాసినిని కోచ్ శివమహేష్, అసోసియేషన్ సభ్యులు, పలువురు అభినందించారు.

Similar News

News April 24, 2025

పదోన్నతితో బాధ్యతలు మరింత అధికమవుతాయి: SP

image

పోలీసు వ్యవస్థలో నిరంతరంగా సేవలందించి పదోన్నతి పొందుతున్న కానిస్టేబుల్‌లకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందనలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పదిమంది పోలీసు కానిస్టేబుల్‌లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. మొత్తం 28 మందికి పదోన్నతి రాగ అందులో ఆదిలాబాద్ జిల్లా వారు పదిమంది ఉండటం సంతోషకరమని ఎస్పీ అన్నారు.

News April 24, 2025

నాగల్ గిద్ద: భూభారతి చట్టంతో రైతులకు మేలు: కలెక్టర్

image

భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. నాగల్ గిద్దలో భూభారతి చట్టంపై అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ చట్టంతో భూమికి సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.

News April 24, 2025

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రాజధాని, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. మే 2న అమరావతి పర్యటనకు రావాలని ఆయనను ఆహ్వానిస్తారని సమాచారం.

error: Content is protected !!