News March 27, 2025
MNCL జిల్లాలో జోరుగా నకిలీ విత్తనాల దందా

జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతోంది. ఎక్కడ తయారుచేస్తున్నారో.. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలియదు. వాటిని రైతులకు అంటగట్టి మోసగిస్తున్నారు. . వారం వ్యవధిలో తాండూర్లో 247KGల విత్తనాలు సీజ్ చేసి 8మందిని అరెస్ట్ చేశారు. కాసిపేట మండలంలో 315కిలోల విత్తనాలు సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా మందమర్రి, కన్నెపల్లిలో వందల కేజీల్లో విత్తనాలు జప్తు చేయగా పలువురిని అరెస్ట్ చేశారు.
Similar News
News November 26, 2025
త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు గడువు పెంపు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. త్రీ వీలర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
News November 26, 2025
దివ్యాంగులకు ఎల్లుండి ఆటల పోటీలు

నవంబర్ 28న జిల్లా దివ్యాంగులకు ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 54 ఏళ్ల మధ్య దివ్యాంగులకు పరుగు పందెం, షాట్పుట్, చెస్, జావెలిన్ త్రో, క్యారమ్స్ వంటి విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు కలెక్టర్ కార్యాలయ సముదాయం గ్రౌండ్లో ప్రారంభమయ్యే ఈ పోటీల్లో ఆసక్తిగల దివ్యాంగులు పాల్గొని ప్రోగ్రాంను విజయవంతం చేయాలన్నారు.
News November 26, 2025
సీతంపేటలో కేంద్ర నోడల్ అధికారి పర్యటన

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ సీతంపేటకు విచ్చేశారు. ఆశావాహ జిల్లా, బ్లాక్స్ ప్రోగ్రాంకు జిల్లా కేంద్ర నోడల్ అధికారిగా సీతంపేటకు విచ్చేసిన ఆమెకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి, జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ స్వాగతం పలికారు. కలెక్టర్ జిల్లాలో గిరిజన సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను ఆమెకు సంక్షిప్తంగా వివరించారు.


