News March 21, 2025
MNCL: జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు: డీఈవో

మంచిర్యాల జిల్లాలో రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను డీఈవో యాదయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 20, 2025
సీఎం విదేశీ పర్యటనపై బండి సంజయ్ ఫైర్

అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి జపాన్‌లో పర్యటిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివారం పెద్దపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు కలసి బహిరంగ సభలు పెట్టి ముస్లిం ఓట్ల కోసం డ్రామాలు ఆడుతన్నాయని ద్వజమెత్తారు.
News April 20, 2025
HYD: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి

క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి దాయరలో ఆదివారం కొందరు యువకులు క్రికెట్ కోసం త్యాగి వెన్యూ గ్రౌండ్ బుక్ చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో క్రికెట్ ఆడుతూ ప్రణీత్ (32) ఒక్కసారి కుప్పకూలాడు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందినట్లు తెలుస్తోంది.
News April 20, 2025
తిరుపతిలో నూతన ఆసుపత్రిని ప్రారంభించిన కలెక్టర్

తిరుపతిలో నూతన ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఆదివారం మంగలం రోడ్ కరకంబాడ్ దగ్గర గల తిరుపతి ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్‌ను బోర్డు సర్టిఫైడ్ సర్జన్, పిల్లల ఆర్థోపెడిక్ సర్జన్ డా.దుర్గాప్రసాద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.