News February 16, 2025

MNCL: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

image

ADB, KNR, NZB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Similar News

News October 27, 2025

తిరుపతికి రూ.కోటి.. చిత్తూరుకు రూ.50 లక్షలు విడుదల

image

మొంథా తుపాన్‌ను ఎదుర్కునేందుకు చిత్తూరు, తిరుపతి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాకు రూ.కోటి, చిత్తూరు జిల్లాకు రూ.50 లక్షల నిధులు విడుదల చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

News October 27, 2025

NGKL: వర్షాలకు నల్లబారుతున్న పత్తి.. దిగుబడి తగ్గే ప్రమాదం

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో 20 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెల్ల బంగారం అని పిలిచే పత్తి నల్లబారుతోంది. కోతకు వచ్చిన పంట పొలాల్లోనే తడిసి ముద్దవడంతో, పత్తి తీయడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 2.65 లక్షల ఎకరాలలో పత్తి సాగు అయిందని అధికారులు అంచనా వేశారు. ఈ వర్షాల కారణంగా జిల్లాలో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

News October 27, 2025

స్వగ్రామానికి చేరిన తల్లి, కూతురు మృతదేహాలు

image

కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన మంగ సంధ్యారాణి (43), ఆమె కుమార్తె చందన (23) మృతదేహాలు స్వగ్రామం మెదక్ మండలం శివాయిపల్లికి చేరాయి. డీఎన్ఏ పరీక్షల అనంతరం నిన్న సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. భర్త ఆనంద్‌ గౌడ్ మృతదేహాలను తీసుకొచ్చారు. మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.