News April 4, 2025

MNCL: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News October 7, 2025

వరంగల్ పరిధిలో 23 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు

image

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 23 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. సోమవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 22 మందితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరు పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. వీరందరికీ కోర్టు జరిమానా విధించిందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 7, 2025

జగన్ వస్తే.. నేనూ వస్తా: సత్యకుమార్

image

AP: నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిశీలనకు జగన్ వస్తే తానూ వచ్చి పరిస్థితిని వివరిస్తానని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వం విస్మరించిందని, ఆ పాపం ఇప్పుడు తమకు శాపంగా మారిందని దుయ్యబట్టారు. ప్రజలు గుణపాఠం చెప్పినా జగన్‌లో మార్పు రావడం లేదని సత్యకుమార్ మండిపడ్డారు. వైసీపీ నేతలకు పీపీపీకి, ప్రైవేటైజేషన్‌కు మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు.

News October 7, 2025

రామాయణం ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శక గ్రంథం: ఎస్పీ

image

మహర్షి వాల్మీకి రచించిన రామాయణం ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శక గ్రంథంగా ఉందని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, కర్తవ్యం వంటి మార్గాలు నేటి యువతకు ఆచరణీయమని, వాటిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఎస్పీ సూచించారు.