News March 23, 2025
MNCL: డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం

మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో శనివారం భూ సంబంధిత సమస్యల పరిష్కారానికై డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్డీవో గూడూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్, డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు పాల్గొన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రతి మండలంలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులో సమస్యలు ఉన్న వాటిని డివిజన్ కమిటీకి పంపాలని ఆదేశించారు.
Similar News
News November 27, 2025
కోరుట్ల: ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న కోరుట్ల మండలంలోని మోహన్రావుపేటలో నామినేషన్ల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్లు వేసే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, తహశీల్దార్ కృష్ణ చైతన్య తదితరులున్నారు.
News November 27, 2025
రాజమండ్రి: సివిల్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్కు అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఏడీ బి. శశాంక తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 30లోగా రాజమండ్రిలోని స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. డిసెంబర్ 5న జరిగే స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి విజయవాడలో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.
News November 27, 2025
గాంధీ భవన్ వైపు రంగారెడ్డి నేతల చూపు

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. అయితే రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇంతవరకు అధ్యక్షుడిని నియమించలేదు. ఎందుకు అధ్యక్షా? అని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రశ్నిస్తున్నారు. డీసీసీ చీఫ్ పోస్టు కోసం రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 43 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థానికేతరుడిని నియమిస్తున్నారని తెలియడంతో పలువురు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఎంపిక వాయిదా పడిందని సమాచారం.


