News January 31, 2025
MNCL: తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

మంచిర్యాలలోని కాలేజీ రోడ్‌కు చెందిన చిట్యాల తరుణ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేసే తరుణ్ పనికి సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లి సూరమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాహనాల కూలెంట్ తాగాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఏఎస్సై వెంకన్న గౌడ్ తెలిపారు.
Similar News
News December 1, 2025
మక్తల్ ప్రజా విజయోత్సవాలు ముఖ్యాంశాలు

✓మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం.
✓5 వేల కోట్లుతో లక్ష ఎకరాలకు నీరందించనున్న ప్రాజెక్ట్‌పై మంత్రి శ్రీహరి ధన్యవాదాలు.
✓మక్తల్‌కు 50 కోట్లతో హాస్పిటల్ ఆమోదం.
✓మక్తల్–నారాయణపేట మధ్య 210 కోట్లతో నాలుగు లైన్ల రోడ్ మంజూరు.
✓పర్యాటక, దేవాలయాల అభివృద్ధికి జూపల్లి కృష్ణారావు నిధుల కేటాయింపు.
✓మక్తల్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావాలని మంత్రి శ్రీహరి హామీ.
News December 1, 2025
మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులు సత్కరించిన కలెక్టర్

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ భీమవరం కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాక్ అసెంబ్లీలో ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
News December 1, 2025
గద్వాల: ఎట్టకేలకు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

గద్వాల మండలం కొత్తపల్లి నుంచి ఆత్మకూరు వరకు కృష్ణా నదిలో రూ.121 కోట్లతో హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు సోమవారం భూమి పూజ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు సమీపంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సీఎం పేర్కొన్నారు.


