News January 31, 2025
MNCL: తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

మంచిర్యాలలోని కాలేజీ రోడ్‌కు చెందిన చిట్యాల తరుణ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేసే తరుణ్ పనికి సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లి సూరమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాహనాల కూలెంట్ తాగాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఏఎస్సై వెంకన్న గౌడ్ తెలిపారు.
Similar News
News December 7, 2025
నిజామాబాద్: DCCలకు పరీక్ష

కొత్తగా ఎన్నికైన ఉమ్మడి NZB జిల్లా DCC అధ్యక్షులు గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. నవంబర్ 22న ఉమ్మడి జిల్లాలో NZB DCC అధ్యక్షుడిగా కాటిపల్లి నగేష్ రెడ్డి, KMR DCC అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఆలేను నియమించారు. కొత్తగా నియమితులైన వారి పని తీరును ఆరు నెలల పాటు పరిశీలిస్తామని ఇప్పటికే CM ప్రకటించారు. GP ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందోనని వారిలో టెన్షన్ పట్టుకుంది.
News December 7, 2025
వెంకటాపూర్: జడ్పీటీసీ నుంచి సర్పంచ్‌గా పోటీ

వెంకటాపూర్ మండలం నర్సాపూర్ పంచాయతీ సర్పంచ్‌గా తాజా మాజీ జడ్పీటీసీ రుద్రమదేవి అశోక్ బరిలో నిలిచారు. గతంలో నర్సాపూర్ సర్పంచ్‌గా పని చేసిన ఆమె, అనంతరం జడ్పీటీసీగా గెలుపొందారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తిరిగి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు రుద్రమదేవి తెలిపారు.
News December 7, 2025
KNR: తమ్మీ నమస్తే.. ఇంటికొచ్చి ఓటేసి వెళ్లు!

ఉమ్మడి KNRలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. అభర్థులు, ఆశావహులు గ్రామాల్లో తిరుగుతూ ‘బాబాయ్, చిన్నమ్మ.. నీ ఓటు నాకే వేయాలి’ అంటూ ఓటర్లకు దగ్గరవుతున్నారు. ఓటు బ్యాంకింగ్ పెంచుకోవడానికి ఉద్యోగం, ఉపాధి నిమిత్తం పట్టణాల బాట పట్టిన వారికి సైతం అభ్యర్థులు కాల్ చేసి ‘అన్నా, తమ్మీ నమస్తే. ఈసారి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా. ఇంటికొచ్చి ఓటేసి వెళ్లు’ అంటూ కాల్ చేసి మరీ పిలుస్తున్నారట. మీకూ కాల్ వచ్చిందా?


