News January 31, 2025
MNCL: తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

మంచిర్యాలలోని కాలేజీ రోడ్‌కు చెందిన చిట్యాల తరుణ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేసే తరుణ్ పనికి సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లి సూరమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాహనాల కూలెంట్ తాగాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఏఎస్సై వెంకన్న గౌడ్ తెలిపారు.
Similar News
News February 16, 2025
కరీంనగర్: ‘కేసీఆర్‌కు పట్టిన గతే సీఎంకు పడుతుంది’

ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలన్నారు. లేకపోతే మాజీ సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
News February 16, 2025
కాళేశ్వరం: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరం పుణ్య క్షేత్రానికి మంథని డిపో నుంచి మంథని-కాళేశ్వరానికి 26 బస్సులను నడిపించనున్నట్లు KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని బట్టి కరీంనగర్, గోదావరిఖని డిపోల నుంచి అదనపు బస్సులను నడిపిస్తామన్నారు. అలాగే వేలాల క్షేత్రానికి గోదావరిఖని డిపో నుంచి GDK-వేలాలకు 56 బస్సులు, మంథని డిపో నుంచి మంథని-వేలాలకు 40 బస్సులు నడిపిస్తామన్నారు.