News January 1, 2025
MNCL: తీవ్ర విషాదం.. నలుగురు మృతి
2024 చివరి రోజు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు యువకులు మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మెుగవెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో బైక్ అదుపుతప్పి కడెం కెనాల్లో పడి ఇద్దరు యువకులు చనిపోయారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News January 7, 2025
ADB డీఈఓను పరామర్శించిన కలెక్టర్
ఆదిలాబాద్ విద్యాశాఖాధికారి ప్రణీతకు గుండెపోటు వచ్చిన నేపథ్యంలో ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజర్షిషా మంగళవారం ఆమెను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి డీఈఓ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, తదితరులున్నారు.
News January 7, 2025
మంచిర్యాల: సాఫ్ట్ వేర్ దంపతుల సూసైడ్
ఓ సాఫ్ట్ వేర్ దంపతులు సూసైడ్ చేసుకున్న ఘటన HYDలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు.. మియాపూర్‌కు చెందిన సందీప్, మంచిర్యాలకు చెందిన కీర్తికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3ఏళ్ల పాప, 14 నెలల బాబు ఉన్నారు. ఆదివారం పాప బర్త్ డే విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. అనంతరం సందీప్ బయటకు వెళ్లి తిరిగొచ్చే సరికి ఇంట్లో కీర్తి ఉరేసుకుని కనిపించింది. దీంతో మనస్తాపం చెందిన సందీప్ సూసైడ్ చేసుకున్నాడు.
News January 7, 2025
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి: MNCL కలెక్టర్
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 29 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.